: లాంతర్ల వెలుగులో టీడీపీ దీక్ష


విద్యుత్ సమస్యపై నిరవధికంగా ఉద్యమించాలని నిర్ణయించిన తెలుగుదేశం పార్టీ నేతలు నేడు వినూత్నంగా దీక్ష నిర్వహిస్తున్నారు. పాత ఎమ్మెల్యే క్వార్టర్ల వద్ద లాంతర్ల వెలుగులో వారు దీక్ష కొనసాగిస్తున్నారు. కాగా, టీడీపీ నేతల నిరవధిక నిరాహార దీక్షకు వామపక్షాలు మద్దతు తెలిపాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తదితరులు టీడీపీ దీక్షా శిబిరాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ, విద్యుత్ సమస్యపై సర్కారు మెడలు వంచాలని పిలుపునిచ్చారు. మునుపటిలా టెలిస్కోపిక్ పద్ధతిని అనుసరించాలని రెగ్యులేటరీ కమిషన్ సూచించినా, ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ఆయన విమర్శించారు. పైగా, ఛార్జీలు పెంచాలంటూ కమిషన్ పైనే ఒత్తిడి పెంచుతోందని ఆయన ఆరోపించారు. 

  • Loading...

More Telugu News