: తిరుమలేశుని దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శ్రీవారి ఆలయ శుద్ధిలో భాగంగా ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సేవ జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ధర్మ దర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. తిరుమంజనం సేవ అయిన అనంతరం... కొద్దిసేపటి క్రితమే టీటీడీ తిరిగి దర్శనానికి అనుమతించడంతో క్యూలైన్లలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది.