: విషాదపు ఆనవాళ్లను దర్శించడానికి వీసా ఫీజు లేదు!
ప్రపంచాన్ని కలవరపెట్టిన మలేసియా విమానం అదృశ్యం కాలేదని, ప్రమాదం జరిగి అఖండ జలాల్లో సమాధైందని భావిస్తున్నారు. ప్రమాదాన్ని నిర్ధారించే ఆనవాళ్లు లభించకున్నా, ఆస్ట్రేలియా సముద్ర జలాల్లో మలేసియా విమాన ప్రయాణికులు శాశ్వత నిద్రలోకి జారుకున్నారని యావత్ ప్రపంచం భావిస్తోంది. దీంతో పలు దేశాల్లోని మానవతావాదులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు వారి బంధువులకు సానుభూతి తెలుపుతున్నారు.
ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ సానుభూతిని మరింత గాఢంగా తెలిపింది. విషాదంలో మునిగిపోయిన మలేసియా విమాన ప్రయాణికుల కుటుంబ సభ్యులను ఆత్మీయంగా గుండెలకు హత్తుకుని ఓదార్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. విమాన శకలాలు దొరికితే వాటిని చూసేందుకు వచ్చే కుటుంబ సభ్యులు, బంధువులకు వీసా ఫీజు వసూలు చేయబోమని ఆస్ట్రేలియా తెలిపింది.