: బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకో... శ్రీనివాసన్ కు సుప్రీం ఆదేశం
సంచలనం సృష్టించిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉచ్చు బీసీసీఐ ఛైర్మన్ శ్రీనివాసన్ మెడకు బిగుసుకుంది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలంటే శ్రీనివాసన్ పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు తెలిపింది. ఆయన స్వయంగా పదవినుంచి తప్పుకోకపోతే ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీం హెచ్చరించింది. కోర్టు ప్రకటనపై స్పందించేందుకు శ్రీనివాసన్ నిరాకరించారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల యాజమాన్యాలపై వచ్చిన ఆరోపణలపై జస్టిస్ ముకుల్ ముద్గల్ ఆధ్వర్యంలోని కమిటీ కొన్ని రోజుల కిందట ఓ నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. అందులో శ్రీనివాసన్ అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో గురునాథ్ మెయ్యప్పన్ పై నివేదికలో తీవ్ర వ్యాఖ్యలు ఉన్నాయి.