: శేషాచలంలో ఆగని అగ్నికీలలు
పవిత్ర తిరుమల ఆలయాన్ని చుట్టుముట్టి ఉన్న శేషాచలం అడవులను అగ్నికీలలు వదిలేట్టు లేవు. మంటలు ఆర్పివేశామన్న ఆనందం ముగియక ముందే తలకోన సమీపంలో తాజాగా మంటలు చెలరేగాయి. బాలపల్లి, చామల రేంజ్ లోని కన్నెమడుగు, ఈతపెంట, బొమ్మాళికొండ, నల్లగుట్ట, రాయితీసినకనుమ అటవీప్రాంతంలో మంటలు ఎగసిపడుతున్నాయి.