: నెల్లూరు జిల్లాలో రూ. 3.75 కోట్లు స్వాధీనం


నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలంలోని చిల్లకూరు చెక్ పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో రూ. 3.75 కోట్లు పట్టుబడ్డాయి. ఈ డబ్బు తిరుపతి యూనియన్ బ్యాంకుకు చెందినవని పోలీసులు చెబుతున్నారు. నగదును గుంటూరుకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే, సరైన పత్రాలు లేనందున నగదును సీజ్ చేసినట్టు ఎస్ఐ తెలిపారు. పట్టుబడిన డబ్బును విజిలెన్స్ టీంకు అప్పగిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News