: త్వరలో మోడీతో భేటీ కానున్న మరో సినీ హీరో మోహన్ బాబు
ప్రముఖ సినీ హీరో మోహన్ బాబు త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు ధ్రువీకరించినట్టు సమాచారం. ఇటీవలే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మోడీని కలిశారు. నిన్న సాయంత్రం సినీ హీరో నాగార్జున కూడా మోడీని కలిసిన సంగతి తెలిసిందే.