: మెడికల్ పీజీ ప్రవేశ పరీక్ష అక్రమాలపై సీఐడీ విచారణ
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నిర్వహించిన మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షల్లో అక్రమాలపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈరోజు సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలోని పరీక్షల నిర్వహణ విభాగాలను సీఐడీ అధికారులు పరిశీలిస్తున్నారు.