: విమానంలో ప్రయాణికులెవరూ సజీవంగా లేరు!: మలేషియా ఎయిర్ లైన్స్
కనిపించకుండా పోయిన మలేషియా విమానంలో ప్రయాణికులెవరూ బతకలేదని మలేషియా ఎయిర్ లైన్స్ తెలియజేసింది. ఆ విషయాన్ని ప్రయాణికుల కుటుంబ సభ్యులకు ఎస్ఎంఎస్ ద్వారా ఆ సంస్థ తెలిపింది. విమానం హిందూ మహా సముద్ర దక్షిణ ప్రాంతంలో కూలిపోయిందని, 12 మంది సిబ్బంది సహా 239 మంది ప్రయాణికులు జలసమాధి అయ్యారని మలేషియా ఎయిర్ లైన్స్ ప్రకటించింది.