: భారత్, పాక్ సరిహద్దుల్లో హోలీ ఆడిన షిండే
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ ఏడాది హోలీని విభిన్నరీతిలో జరుపుకున్నారు. హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు షిండే ఈ రోజు భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లోని జైసల్మేర్ వెళ్ళారు. అక్కడ ఆయన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లతో హోలీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అంతకుముందు రాజస్థాన్ లోని తోనోత్ మాతా ఆలయంలో పూజలు నిర్వహించారు,.