: ముతాలిక్ ను ఆహ్వానించడం ముమ్మాటికీ తప్పే: అరుణ్ జైట్లీ
ఓ మహిళపై దాడికి పాల్పడిన శ్రీరామ్ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ ను బీజేపీలోకి ఆహ్వానించడం ముమ్మాటికీ తప్పేనని ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. ఈ తరహా తప్పులు పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన అన్నారు. ముతాలిక్ పార్టీలో చేరిన మరుక్షణమే వివాదం నెలకొనడంతో... కొన్ని గంటలకే ఆయనను బయటకు పంపించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆయన పార్టీ నేతలకు హితవు పలికారు. కొత్త వారిని పార్టీలో చేర్చుకోబోయే ముందు వారి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని జైట్లీ చెప్పారు.