: విజయరాణిని వెంటనే అరెస్ట్ చేయండి: తమ్మారెడ్డి భరద్వాజ
చిట్టీల పేరుతో సినీ, టీవీ ఆర్టిస్టులను దాదాపు రూ. 8 కోట్ల మేర మోసగించి పరారైన బుల్లితెర నటి విజయరాణిని వెంటనే అరెస్ట్ చేయాలని సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయనతో పాటు పలువురు టీవీ ఆర్టిస్టులు సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆమెను ట్రేస్ చేసి, అరెస్ట్ చేయాలని... బాధితులందరికీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా తమ్మారెడ్డి కోరారు.