: బీజేపీ ఎంపీ చేతిలో బైబిల్... ఎన్నికల సంఘానికి ఫిర్యాదు


గోవాలో ఓ బీజేపీ ఎంపీ చేతిలో బైబిల్ పట్టుకుని చిక్కుల్లో పడ్డాడు. ఉత్తర గోవా లోక్ సభ స్థానం నుంచి బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ శ్రీపాద్ నాయక్ ఎన్నికల ప్రచారం ఆరంభిస్తూ ఓ చర్చిలో బైబిల్ పట్టుకుని కెమెరాలకు పోజులిచ్చాడు. దీనిపై రోడ్రిగ్స్ అనే న్యాయవాది గోవాలోని ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మతపరమైన చిహ్నంతో ఎన్నికల ప్రచారం చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మసీదులు, చర్చిలు, దేవాలయాలు ఇతర ప్రార్థనా మందిరాలు, వాటికి సంబంధించిన చిహ్నాలతో ఎన్నికల ప్రచారం చేయడాన్ని ఎన్నికల నియమావళి నిషేధించిందని రోడ్రిగ్స్ చెప్పారు. దీనిపై శ్రీపాద్ నాయక్ స్పందిస్తూ, తన నియోజకవర్గంలోని ఓటర్లను కలుసుకోవడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఆ చర్చి తన నియోజకవర్గ పరిధిలోనే ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News