: ఒక్కొక్కరి ఆస్తి 40 లక్షలు: గుట్టు విప్పిన సత్యమేవ జయతే


దేశ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్న సామాజిక కార్యక్రమం సత్యమేవ జయతే మరో సంచలనాత్మక విషయాన్ని వెల్లడించింది. దేశంలో ప్రతి ఒక్కరూ లక్షాధికారే అని తెలిపింది. దేశ సంపదను పంచితే, తలా ఒకరికి 40 లక్షల రూపాయల ఆస్తి ఉంటుందని అమీర్ ఖాన్ తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా ప్రత్యక్షంగానో, లేక పరోక్షంగానో పన్నులు కడుతున్నారని, ఆ పన్నుల సగటును లెక్కించగా దేశ సంపద ఐదు వేల లక్షల కోట్ల రూపాయలుగా తేలింది.

ఇది ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ఖనిజేతర వనరులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వాధికారులు కట్టిన లెక్క. ఈ లెక్క ప్రకారం భారత దేశంలో ఉన్న జనాభా మొత్తానికి ఈ సంపదను పంచితే తలా 40 లక్షల రూపాయల ఆస్తి ఉన్నట్టు లెక్క అని తేల్చారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కోట్లాది ఎకరాల భూమి, పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, స్పెక్ట్రమ్, ఇతర ఆస్తులు లెక్కించి సంపదను పంచితే ప్రతి ఒక్కరూ కోటీశ్వరులేనని అమీర్ అభిప్రాయపడ్డారు.

ఇంత సంపద ఉండి దేశంలో నిరుపేదలు ఎలా ఉన్నారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలు కొల్లగొడుతున్న వైనాన్ని లోకాయుక్త చీఫ్ జస్టిస్ సంతోష్ హెగ్డే వెల్లడించారు. బళ్లారిలో ముడి ఇనుము టన్నుకు 27 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించిన మైనింగ్ కంపెనీలు... అదే టన్ను ఇనుమును 7 వేల రూపాయలకు అమ్ముకున్నాయని తెలిపారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, అనేక మంది మంత్రులు, 14 మంది ఐఏఎస్ అధికారులు, 797 మంది అధికారులు ఈ కుంభకోణంలో భాగస్వాములయ్యారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News