: క్రికెట్ రారాజుకు బహ్రెయిన్ యువరాజు ఆహ్వానం
తమ దేశంలో జరిగే ఫార్ములా వన్ కారు రేసులను వీక్షించేందుకు రావాలంటూ క్రికెట్ రారాజు సచిన్ టెండూల్కర్ ను బహ్రెయిన్ యువరాజు సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆహ్వానించారు. ప్రతి ఏటే బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద ఈ రేసు నిర్వహిస్తారు. వచ్చే నెల 4 నుంచి 6 వరకు రేసు జరగనుంది. కాగా, ఈ ప్రతిష్ఠాత్మక ఎఫ్ 1 రేసుకు సచిన్ తన కుటుంబంతో కలిసి వెళ్ళనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సచిన్ మిత్రుడు, బహ్రెయిన్ లో అగ్రగామి వ్యాపారవేత్త మహ్మద్ దాదాభాయ్ నిర్ధారించారు. సచిన్ రాక ఈవెంట్ కు ప్రధానాకర్షణ అవుతుందని దాదాభాయ్ పేర్కొన్నారు.