: శేషాచలం అడవుల్లో మళ్లీ రాజుకున్న అగ్గి
తిరుమల సమీపంలోని శేషాచలం అడవుల్లో రేగిన భారీ కార్చిచ్చు చల్లారిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మళ్లీ మంటలు లేచాయి. కుమారధార, పుసుపుధార జలాశయం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ రోజు మంటలు మొదలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వాటిని ఆర్పేందుకు చర్యలు చేపట్టారు.