: మంగళవారం నాడు హర్యానాలో మాయావతి పర్యటన
బహుజన సమాజ్ పార్టీ అధినేత మాయావతి మంగళవారం నాడు హర్యానాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మాయా రెండు బహిరంగ సభల్లో పాల్గొంటారు. మొదటగా ఆమె హిసార్ జిల్లా, రాజ్ ఘర్ రోడ్డులోని కబీర్ హాస్టల్ గ్రౌండ్ లో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం గుర్గావ్ లోని హుడా జింఖానా క్లబ్ గ్రౌండ్ లోని సమావేశంలో పాల్గొంటారని బీఎస్పీ తెలిపింది.