: అవన్నీ పుకార్లు నమ్మొద్దు: వీసీ
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అంబేద్కర్ వర్సిటీ పరిధిలో డిగ్రీ మూడో సంవత్సరం కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం లీకైనట్లు వదంతులు వ్యాపించడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ప్రశ్నాపత్రం లీకేజీ వదంతి అని, దానిని నమ్మొద్దని విశ్వవిద్యాలయ ఉపకులపతి లజపతిరాయ్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన పరీక్ష యథాతథంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.