: వారంతా పశ్చాతాపపడతారు: రఘువీరా రెడ్డి
కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారంతా పశ్చాత్తాపపడే రోజు దగ్గర్లోనే ఉందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. బస్సు యాత్ర సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ వెంట, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వం సిద్ధంగా ఉందని, పార్టీ కార్యకర్తలు కూడా తమతో పాటే ఉన్నారని అన్నారు. సీనియర్ నాయకులు పార్టీ వీడడంతో వీరందరికీ పదవులు, అవకాశాలు వస్తాయని ఆయన తెలిపారు. ద్వితీయ శ్రేణి నాయకులతో పార్టీని బలోపేతం చేస్తామని, దానిని చూసి వారంతా పశ్చాత్తాప పడతారని రఘువీరారెడ్డి జోస్యం చెప్పారు.