: కేసీఆర్ తీరుకు నిదర్శనమిదే: ఎమ్మెల్సీ సంతోష్ కుమార్
కేసీఆర్ విశ్వసనీయుడు కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తన కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రారని స్పష్టం చేసిన కేసీఆర్, ఇప్పుడు మాట మార్చి తన కుటుంబం ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారని అన్నారు. దళితుడ్ని తెలంగాణకు ప్రధమ ముఖ్యమంత్రిని చేస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్, ఇప్పడు తెలంగాణ రాష్ట్ర భావి ముఖ్యమంత్రిగా తనను తాను పరిచయం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తాననడం వెనుక ఉద్దేశం సీఎం కుర్చీ ఎక్కడానికేనని అన్నారు. దళితులను పార్టీ నుంచి గెంటేసిన చరిత్ర కేసీఆర్ ది అని ఆయన దుయ్యబట్టారు.