: సిబ్బందే ఇంటికొచ్చి ఓటరు స్లిప్పులిస్తారు


రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఓటరు స్లిప్పులివ్వడం ఇకపై నేరం. పోలింగ్ అధికారులే స్వయంగా ఓటరు స్లిప్పులను పోలింగ్ కు ఐదు రోజుల ముందు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తారు. ఓటరు స్లిప్పులో ఓటరు ఫొటో, బూత్ నంబర్ అన్నీ స్పష్టంగా ఉంటాయి. స్లిప్పులపై బూత్ అధికారి సంతకం తప్పనిసరిగా ఉండాలి. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. స్లిప్పులు అందని వారు పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పొందవచ్చు. రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు స్లిప్పులు పంపిణీ చేస్తే జరిమానా లేదా జైలుశిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News