: పవార్ వ్యాఖ్యలపై ఈసీ మండిపాటు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్కొక్కరు రెండు ఓట్లు వేయాలంటూ మహారాష్ట్రలో నిన్న (ఆదివారం) జరిగిన ఓ సమావేశంలో పార్టీ కార్యకర్తలను పవార్ ఈ మేరకు కోరారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పలువురు ఈసీకి ఫిర్యాదు చేయడంతో, ప్రసంగ వీడియోను ఈసీ పరిశీలించనుంది.