: బాబు ముఖ్యమంత్రి కావాలని శ్రీవారిని కోరుకున్నా: సీఎం రమేష్
టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని చంద్రబాబు మరోసారి అధిష్ఠించాలని స్వామి వారిని కోరుకున్నట్టు తెలిపారు.