: 'అయామ్ ఫర్ ఇండియా' అంటున్న రజనీకాంత్ సతీమణి


తన శ్రేయస్సు కంటే తన చుట్టూ ఉండేవాళ్ళ క్షేమాన్ని కాంక్షించే సినీ హీరోల్లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాతే ఎవరైనా. ఎవరు కష్టాల్లో ఉన్నా చలించిపోయే ఆయన, తగిన సహాయం చేసి వారిని గట్టెక్కించిన సందర్భాలు ఎన్నో. ఇప్పుడాయన సతీమణి లత కూడా భర్త బాటలోనే నడవాలని నిశ్చయించుకుంది. తన వంతుగా సమాజానికి ఏదైనా చేయాలన్న తలంపుతో 'అయామ్ ఫర్ ఇండియా' అంటూ ఓ డ్రీమ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.

భారతదేశ ఘన వారసత్వం, వైవిధ్యభరితమైన సంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్ధేశం. చెన్నయ్ లో 'వైభవ్ మేళా' పేరిట మార్చి 30న  ఉదయం 10.30 కి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడి కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపం ఈ కార్యక్రమానికి వేదిక. ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ తన ట్రేడ్ మార్కు డ్యాన్సులతో అలరిస్తాడు. 

  • Loading...

More Telugu News