: జగన్ పార్టీకి అభ్యర్థుల్లేరంటున్న యనమల


మున్సిపల్, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అభ్యర్థులు లేరని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. పార్టీలో సమర్థులైన నేతలే లేకపోవడంతో ఇప్పుడా పార్టీకి కంటిమీద కునుకుండడంలేదని వ్యాఖ్యానించారు. ఓటమి భయంతో జగన్, విజయమ్మ, షర్మిల తీవ్రంగా పర్యటిస్తున్నారని యనమల పేర్కొన్నారు. గతంలో ఉన్న సానుభూతి పవనాలు ఇప్పుడు వీయకపోవడం, ప్రజలు ఆ మత్తులోంచి బయటికిరావడంతో ఈ త్రయానికి ఏమీ పాలుపోవడంలేదని అన్నారు.

  • Loading...

More Telugu News