: హిందూ మహా సముద్రంలో కనిపించిన సీట్ బెల్టులు!
మలేసియా విమానం ఆచూకీ కనుగొనేందుకు యత్నాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. చైనా శాటిలైట్లు సముద్రంలో భారీస్థాయిలో శకలాలు తేలుతుండడాన్ని చిత్రాల రూపంలో కంట్రోల్ రూంకు పంపడం తెలిసిందే. తాజాగా, దక్షిణ హిందూ మహాసముద్రంలో సీట్ బెల్టులు, సరకు రవాణా పెట్టెలు తేలుతూ కనిపించాయని ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు. అయితే, విమానం కూలిపోయిందని చెప్పడం తొందరపాటు అవుతుందని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ పేర్కొన్నారు. కీలక ఆధారాలు లభ్యమవుతున్నాయని, ఆ దిశగా ముందుకు వెళతామని ఆయన తెలిపారు.