: ఉద్యోగుల పట్ల చంద్రబాబు సానుకూల వైఖరి
ఉద్యోగుల పట్ల తెలుగుదేశం పార్టీ విధివిధానాలు తెలపాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కోరగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. తాము అధికారంలోకి రాగానే ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల విధి నిర్వహణలో అభద్రతకు చోటు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తాము పూర్తిగా ప్రైవేటు రంగానికి ప్రాధాన్యత ఇవ్వడంలేదని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు పోటీ పడితే అంతిమంగా ప్రజలకు మేలు చేకూరుతుందన్నది తన ఆలోచన అని బాబు వివరించారు.
హైదరాబాదులో జరిగిన ఏపీజేఎఫ్ మీట్ ద పీపుల్ కార్యక్రమంలో చంద్రబాబు, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు అశోక్ బాబు మాట్లాడుతూ, టీడీపీకి దూరంగా ఉండాలని ఉద్యోగ సంఘాలు కోరుకోవడంలేదని తెలిపారు.