: ఏప్రిల్ 1 నుంచి సవరించిన రైల్వే ఛార్జీల అమలు


సవరించిన రైల్వే ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటవ తేదీ తర్వాత ప్రయాణానికిగానూ ముందుగా రిజర్వేషన్ చేసుకున్నవారు కూడా పెంచిన ఛార్జీని చెల్లించాలని తెలిపారు. రైల్వే బుకింగ్ కేంద్రంలో గానీ, రైళ్లలో టీటీఈలకు గానీ ప్రయాణికులు ఈ రుసుమును చెల్లించి రశీదు తీసుకోవాలని అధికారి సూచించారు. 2013-14 బడ్జెట్ లో రైల్వేశాఖ ఉన్నత తరగతుల ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News