: పవన్ సినిమాలు హైదరాబాద్ లో ఎలా ఆడతాయో చూస్తాం: అసదుద్దీన్
బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని సినీ నటుడు పవన్ కల్యాణ్ కలసి మద్దతు పలకడాన్ని మజ్లిస్ పార్టీ జీర్ణించుకోలేకుంది. ఇందుకు నిదర్శనంగా ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ హెచ్చరికలు జారీ చేశారు. పవన్ సినిమాలు హైదరాబాద్ లో ఎలా ఆడతాయో చూస్తామన్నారు. చిరంజీవి పార్టీ పెడితేనే ఇక్కడ పప్పులుడకలేదని, ఇక ఆయన తమ్ముడు పవన్ వల్ల ఏం సాధ్యమవుతుందని ప్రశ్నించారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారం కోసం మహబూబ్ నగర్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని టీవీ చానళ్లు మోడీకి ఎక్కువగా ప్రచారం కల్పిస్తున్నాయని మండిపడ్డారు.