: పిల్లల్ని వదిలేసి వెళ్లే రకాన్ని కాదు: కాజోల్
నటనకంటే తన పిల్లల యోగక్షేమాలే తనకు ముఖ్యమని ప్రముఖ నటి, అజయ్ దేవగన్ సతీమణి కాజోల్ అన్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. తాను సినిమాలు చేయకపోవడానికి కారణం తన సంతానమేనని ఆమె చెప్పారు. 'పిల్లలు నాతో గడపాలని కోరుకుంటారు. తల్లిగా వారికి తగిన సమయం కేటాయించడం నా బాధ్యత. వదిలేసి వెళ్లడానికి వారిని నేను కనలేదు. నేను అలాంటి దాన్ని కాదు' అని కాజోల్ తన అభిప్రాయాలను తెలిపారు. తన భర్త ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారని, కనీసం తల్లిగా తానైనా పిల్లలతో ఉండాలన్నారు.