: బీజేపీ సీమాంధ్ర ప్రచార సారథిగా పురందేశ్వరి
కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కించుకున్న పురందేశ్వరి... ప్రస్తుతం బీజేపీలోనూ చక్రం తిప్పుతున్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఆమెను ఏకంగా సీమాంధ్రలో పార్టీ ప్రచార సారథిగా బీజేపీ నియమించడం విశేషం. ఈ మేరకు సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు... పురందేశ్వరి పేరును ప్రకటించారు. ఈ నెల 25న విశాఖలో ప్రచారం ప్రారంభిస్తామని, అందులో పురందేశ్వరి, సినీ నటుడు కృష్ణంరాజు తదితరులు పాల్గొంటారని తెలిపారు. 26న శ్రీకాకుళం, విజయనగరంలో, 27న ఉభయ గోదావరి జిల్లాల్లో, 28న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రచారం ఉంటుందని చెప్పారు. మోడీకి పవన్ కల్యాణ్ మద్దతు పలకడం, బీజేపీతో కలసి పనిచేయడానికి లోక్ సత్తా సంసిద్ధత ప్రకటిండాన్ని హరిబాబు స్వాగతించారు.