: మోడీని కార్పొరేట్లు మోస్తున్నారు: కపిల్ సిబల్
కార్పొరేట్ సంస్థలు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తరపున ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయని.. ఆయన అధికారంలోకి వస్తే ఉచిత ఫలాలు పొందాలన్నది వాటి ఆశ అని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ఆరోపించారు. గుజరాత్ లో ప్రస్తుతం అదే పంథా నడుస్తోందన్నారు. 'ప్లేట్ డిన్నర్ కోసం రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వారికి ఉచిత ప్రయోజనాలు కావాలి. ప్రస్తుతం మోడీ గుజరాత్ లో అదే చేస్తున్నారు. మోడీ నుంచి ఫలాలు పొందిన సంస్థలే ప్రస్తుతం మోడీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాయి' అని సిబల్ దాడికి దిగారు. అయితే, ఆయా సంస్థల పేర్లు చెప్పడానికి ధైర్యం చేయలేకపోయారు. ఈ మేరకు కరణ్ థాపర్ డెవిల్స్ అడ్వొకేట్ కార్యక్రమంలో సిబల్ తన అభిప్రాయాలను వెల్లడించారు.