: యూఏఈలో ఐపీఎల్ వేదికలను పరిశీలించిన బీసీసీఐ
యూఏఈలో ఐపీఎల్-7 తొలి అంచె పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో బీసీసీఐ అక్కడి వేదికలను పరిశీలించింది. ఈ మేరకు భారత్ నుంచి యూఏఈ తరలివెళ్ళిన బీసీసీఐ బృందం లీగ్ కు ఆతిథ్యమిచ్చే మూడు వేదికల స్థితిగతులపై సంతృప్తి వ్యక్తం చేసింది. బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ ఎంవీ శ్రీధర్ మాట్లాడుతూ, ఈ మైదానాల్లో ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు. యూఏఈలోని స్టేడియాలు అంతర్జాతీయ వేదికలకు ఏమాత్రం తీసిపోవని తెలిపారు. ఐపీఎల్-7 తొలి అంచె ఏప్రిల్ 16 నుంచి 30 వరకు జరగనుంది.