: కావాలంటే ఢిల్లీ మెట్రోలో కోచ్ బుక్ చేసుకోవచ్చు


ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ పర్యాటకుల సౌకర్యార్థం కోచ్ లు బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. విదేశీ పర్యాటకులు, ప్రైవేటు స్కూళ్ళు, ఎన్జీవోలు మెట్రో రైళ్లలో కోచ్ లు బుక్ చేసుకుని నగరమంతా సందర్శించవచ్చు. కనీసం 45 మంది నుంచి 150 మంది వరకైనా ప్రయాణికులు ఉండాలి. సాధారణ చార్జీలతోపాటు వారికి సౌకర్యాలు కల్పించినందుకు ప్రత్యేకంగా చార్జీ వసూలు చేస్తారు. గరిష్ఠంగా 8 కోచ్ లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఒక్కో కోచ్ చార్జీ 30వేల నుంచి 50వేల రూపాయల వరకు నిర్ణయించారు.

  • Loading...

More Telugu News