: అమితాబ్ దంపతులు అవకాశవాదులు: అమర్ సింగ్
అమితాబ్, ఆయన భార్య జయాబచ్చన్ పై రాష్ట్రీయ లోక్ దళ్ నేత అమర్ సింగ్ విమర్శలతో విరుచుకుపడ్డారు. అమితాబ్, ఆయన భార్య జయాబచ్చన్ అవకాశవాదులని వ్యాఖ్యానించారు. జయాబచ్చన్ సమాజ్ వాదీ పార్టీ తరపున రాజ్యసభ సభ్యురాలిగా ఉంటే... అమితాబ్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తరపున ఎన్నికల ప్రకటనల్లో కనిపించడమేంటని మండిపడ్డారు. వారి అవకాశవాదానికి ఇదే నిదర్శనమని విమర్శించారు. అమర్ సింగ్ కూడా గతంలో సమాజ్ వాదీ పార్టీ నేతగా ఉన్న విషయం తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం ఎన్నికల అనంతరం మోడీతో కలసిపోయేందుకు అమితాబ్ ద్వారా మంతనాలు నెరపుతున్నారని అమర్ సింగ్ ఆరోపించారు.