: పవన్... గడ్డం చూసి మోసపోకు: నారాయణ
రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన పవన్ కల్యాణ్ కు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ 'గడ్డం' గురించి కాస్త బోధన చేశారు. పవన్ కల్యాణ్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కావడంపై స్పందిస్తూ... చేగువేరా గడ్డానికి, మోడీ గడ్డానికి తేడాను పవన్ తెలుసుకోవాలని సూచించారు. చేగువేరా గడ్డం సమాజాన్ని మార్చేదయితే, మోడీ గడ్డం దేశాన్ని ధ్వంసం చేసేదన్నారు. అయినా, పవన్ కల్యాణ్ రాజకీయాలేంటో, ఆయన ఏం చెబుతున్నారో తనకు అర్థం కావడం లేదని నారాయణ ఎద్దేవా చేశారు.