: స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్న బీజేపీ సీనియర్ నేత
బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన జశ్వంత్ సింగ్ రాజస్థాన్ లోని బార్మర్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. రేపు సాయంత్రం నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీజేపీ ఆయనకు టికెట్ కేటాయించకుండా... స్థానికంగా కాంగ్రెస్ నుంచి పార్టీలోకి వచ్చి చేరిన నేతకు కేటాయించింది. దీంతో, జశ్వంత్ ఒకింత బాధకు గురై బీజేపీని ఏకిపారేసిన సంగతి తెలిసిందే. బీజేపీ నకిలీవాదుల చేతుల్లోకి వెళ్లిందని, తనకు పార్టీ టికెట్ నిరాకరించడం ఇది రెండోసారని ఆయన నిన్న విమర్శలకు దిగారు. జశ్వంత్ గతంలో పాక్ వ్యవస్థాపకుడు జిన్నాను పొగిడి బీజేపీ నుంచి కొంతకాలం బహిష్కరణకు కూడా గురయ్యారు. ఈయన అద్వానీ వర్గానికి చెందిన నేత.