: నలుగురు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల అరెస్ట్


ఇండియన్ ముజాహిదీన్ సంస్థకు చెందిన నలుగురు అనుమానిత ఉగ్రవాదులను రాజస్థాన్ లో పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు జైపూర్ లో ముగ్గురు, జోథ్ పూర్ లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో దిల్ షుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు వకాస్ కూడా ఉన్నట్లు సమాచారం. వారి నుంచి డిటోనేటర్లు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ను విడిపించుకుని వెళ్లేందుకు ఆ సంస్థ ఉగ్రవాదులు దాడులకు పాల్పడడంతోపాటు, బీజేపీ నేతలను అపహరించే అవకాశాలున్నాయంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు వీరు పట్టుబడడం భద్రతాదళాలను ఉలిక్కిపడేలా చేసింది.

  • Loading...

More Telugu News