: మల్లికార్జునుడి సేవలో నటుడు శ్రీకాంత్
సినీనటుడు శ్రీకాంత్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా ఈ ఉదయం శ్రీశైలం మల్లికార్జునుడిని దర్శించుకున్నారు. మహా మంగళహారతి సేవలో పాల్గొన్నారు. స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. విజన్ ఉన్న నాయకుడికి ఓటేయాలని సూచించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న సినిమాలో వినోదాత్మక పాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్ నటించిన 'ఖడ్గం' సినిమా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. నాటుకోడి, మొండోడు, వీడికి దూకుడెక్కువ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయని శ్రీకాంత్ తెలిపారు.