: పవన్ కల్యాణ్, కేసీఆర్ పై దానం ఆగ్రహం
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మాజీ మంత్రి దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడని కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. జనసేన ఆవిర్భావం సందర్భంగా ఘనంగా మాట్లాడిన పవన్ కల్యాణ్, మతతత్వ బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధపడడం అభిమానులకు మింగుడుపడడం లేదని తెలిపారు. కేసీఆర్, పవన్ కల్యాణ్ ఇద్దరూ విశ్వసనీయత కోల్పోయారని దానం మండిపడ్డారు.