: బీరుతో బెనిఫిట్స్ ఉన్నాయట!
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్న ప్రకటనలు అటుంచితే... బీరుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు డచ్ పరిశోధకులు. బీరు తాగితే ధమనులు బలంగా తయారయి, రక్తప్రసరణ సాఫీగా సాగుతుందని వారంటున్నారు. కొన్ని అధ్యయనాలు బీరు సేవించడం వల్ల హార్ట్ ఎటాక్ ప్రమాదం ఉంటుందని చెప్పడాన్ని ఈ తాజా అధ్యయనం కొట్టి పారేస్తోంది.
గుండె సంబంధ వ్యాధులను 20 నుంచి 40 శాతం తగ్గించడంలో బీరు ఎంతో ప్రయోజనకారి అని, విటమిన్లతో పరిపుష్టమై ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అధ్యయనంలో భాగంగా బీరు తాగేవారిలో బీ6 విటమిన్ 30 శాతం పెరగడాన్ని గుర్తించారు. అంతేగాకుండా, కిడ్నీలో రాళ్ళను కూడా తగ్గిస్తుందట. సరైన మోతాదులో తీసుకుంటే మానసిక ఆరోగ్యానికి కూడా మంచిదని పరిశోధకులు సెలవిచ్చారు.