: విమాన శకలాలపై మరికొన్ని గంటల్లో చైనా కీలక ప్రకటన
మలేసియా విమానం అదృశ్యంపై కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. చైనా ఉపగ్రహాలు దక్షిణ చైనా సముద్రంలో భారీ స్థాయిలో శకలాలను కనుగొన్నట్టు మలేసియా అధికారులు తెలిపారు. ఆ శకలాలు ఉన్న ప్రాంతానికి చైనా రెండు నౌకలను పంపింది. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో విమానం ఆచూకీ వ్యవహారం ఓ కొలిక్కిరానుంది. ఈ మేరకు తాజా సమాచారంతో చైనా ఓ ప్రకటన చేయనుంది.