: కిరణ్ ను విమర్శించే అర్హత వారెవరికీ లేదు: తులసిరెడ్డి


మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించే అర్హత చిరంజీవి, రఘువీరాతో సహా కాంగ్రెస్ నేతలెవరికీ లేదని ఆ పార్టీ నేత తులసిరెడ్డి హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అడ్డుకునేందుకు సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేశాడని కితాబిచ్చారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తారని తెలిసినా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్ఠానానికి వత్తాసు పలకలేదని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తున్న నేతలు సమైక్యాంధ్ర కోసం ఏం చేశారో చెప్పగలరా? అని ఆయన నిలదీశారు. కిరణ్ ను విమర్శించేందుకు అర్హత కావాలని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News