: ముగ్గురు సైనికాధికారులకు 'కీర్తి చక్ర'
విధి నిర్వహణలో వీరోచితంగా వ్యవహరించిన ముగ్గురు సైనికాధికారులకు నేడు కీర్తిచక్ర ప్రదానం చేశారు. వీరిలో ఉత్తరాఖండ్ వరద సహాయక చర్యల్లో ప్రాణాలు కోల్పోయిన వాయుసేన అధికారి, ముగ్గురు తీవ్రవాదులను హతమార్చిన ఆర్మీ మేజర్, నాన్ స్టాప్ గా పడవలో ప్రపంచాన్ని చుట్టివచ్చిన నేవీ అధికారి ఉన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. 'కీర్తి చక్ర' సైనిక బలగాల సేవలకు గుర్తింపుగా ఇచ్చే రెండో అత్యుత్తమ అవార్డు.
ఇక, మరో పది మందికి శౌర్య చక్ర అవార్డు అందించారు. వీరిలో ఓ ప్రమాదంలో ముగ్గురు సహచరులను కాపాడి, ప్రాణాలు విడిచిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కు చెందిన ఓ సివిల్ ఇంజినీర్, ఓ గ్రామాన్ని అగ్ని ప్రమాదం నుంచి రక్షించిన వాయుసేన జవాన్ ఉన్నారు.