: మలేసియా విమానం కోసం ఇక సముద్ర గర్భంలో వెదుకులాట


రెండు వారాల క్రితం మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి బీజింగ్ పయనమైన ఎంహెచ్ 370 విమానం గాలింపు చర్యలను ఇక సముద్ర గర్భానికీ విస్తరించారు. ఈ మేరకు సోనార్ పరికరాలను అందించాలని మలేసియా ప్రభుత్వం అమెరికాను కోరింది. మలేసియా రక్షణ మంత్రి హషీమొద్దీన్ సముద్రంలోపల గాలింపు చర్యలు చేపట్టేందుకు తగిన సామాగ్రి అందించాలని ఫోన్ ద్వారా అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి చక్ హేగెల్ విజ్ఞప్తి చేశారు. దీనిపై, అమెరికా వర్గాలు ఇంకా స్పందించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News