: అఫ్రిదిని కెప్టెన్ గా నియమించాలని గళమెత్తిన పాక్ మాజీలు
పాకిస్తాన్ కెప్టెన్ గా ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదిని నియమించాలని మాజీ క్రికెటర్లు ఘోషిస్తున్నారు. ప్రస్తుత సారథి మహ్మద్ హఫీజ్ లో నాయకత్వ లక్షణాలు లోపించాయని మాజీ కెప్టెన్లు జావెద్ మియాందాద్, మహ్మద్ యూసుఫ్ అభిప్రాయపడ్డారు. హఫీజ్ ను బాధ్యతల నుంచి తప్పించి అఫ్రిదికి పగ్గాలు అప్పగించాలని వారు పాక్ క్రికెట్ బోర్డును డిమాండ్ చేశారు. వికెట్లు పడకపోయినా, పరుగులను నియంత్రించి ఉంటే భారత బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి పడేదని మియాందాద్ అభిప్రాయపడ్డాడు. భారత్ తో నిన్నటి మ్యాచ్ సందర్భంగా హఫీజ్ తన బౌలర్లను సమయానుకూలంగా ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడని ఆయన విమర్శించాడు.
ఇక, యూసుఫ్ మాట్లాడుతూ హఫీజ్ బాడీ లాంగ్వేజి కూడా అతని వైఖరిని వెల్లడిస్తోందని పేర్కొన్నాడు. అఫ్రిది అయితే పరిమిత ఓవర్ల క్రికెట్ కు కెప్టెన్ గా అతికినట్టు సరిపోతాడని, అందుకు అవసరమైన దూకుడు అతనిలో పుష్కలంగా ఉందని వీరిద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.