: రాయపాటి నడిచే దేవుడు...ఆయనతో వెళ్లాలా? వద్దా? అనే ధర్మసంకటంలో ఉన్నాను: డొక్కా


రాయపాటితో వెళ్లాలా? వద్దా? అనే ధర్మసంకటంలో ఉన్నానని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాయపాటి నడిచే దేవుడని అన్నారు. తనకు ఈ మాత్రం గుర్తింపు, ఈ జీవితం రావడానికి కారణం రాయపాటేనని అన్నారు. అలాంటి రాయపాటి అడిగితే చేయకుండా ఉండనని డొక్కా స్పష్టం చేశారు. ఇప్పటికే తాను ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే మీమాంసలో ఉన్నానని, నియోజకవర్గంలోని కార్యకర్తలతో మాట్లాడి తగిన నిర్ణయిం తీసుకుంటానని డొక్కా తెలిపారు.

  • Loading...

More Telugu News