: 'కేజ్రీవాల్ కు అది మామూలే'


ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు సొంత రాష్ట్రం హర్యానాలో ఊహించని అనుభవం ఎదురైంది. ఫరీదాబాద్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి పురుషోత్తమ్ డాగర్ తో కలిసి ఈ రోజు ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో సందర్భంగా కొంత మంది స్థానికులు ఆయనకు వ్యతిరేకంగా నల్లజెండాలు చూపిస్తూ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో ఆయనకు సొంత రాష్ట్రంలో మద్దతు లేదని ప్రత్యర్థులు విమర్శించడం మొదలుపెట్టారు. దీనికి సమాధానంగా... గతంలో కూడా కొంత మంది నేతలు ఇలాంటి ప్రచారానికి ఒడిగట్టారని, అయినా కేజ్రీవాల్ గెలిచారని ఆయన అభిమానులు అంటున్నారు. కేజ్రీవాల్ కు ఇలాంటివి మామూలేనని, ఆయన వీటిని పట్టించుకోరని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News