: సోనియాకు అంత సంపద ఎక్కడిదని నిలదీసిన తోటికోడలు


తన తోటి కోడలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై... బీజేపీ నేత మేనకాగాంధీ (సంజయ్ గాంధీ భార్య) మాటలతో విరుచుకుపడ్డారు. పెళ్లయ్యేటప్పుడు కనీసం కట్నం కూడా లేకుండా వచ్చిన వ్యక్తి, ఈ రోజు ప్రపంచంలోనే ఆరవ సంపన్న మహిళానేత (విదేశీ సర్వేల ఆధారంగా) ఎలా అయ్యారని మేనక ప్రశ్నించారు. భారీ ఎత్తున అవినీతిలో మునిగిపోయారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మేనక పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

నియోజకవర్గం పరిధిలోని పురానాపూర్ లో జరిగిన బహిరంగ సభలో మేనక మాట్లాడారు. సోనియా పెళ్లి చేసుకుని భారత్ కు వచ్చినప్పుడు ప్రజల అభిమానం, ప్రేమ మాత్రమే ఉందని, ఆమె వద్ద చిల్లిగవ్వ కూడా లేదన్నారు. కానీ, నేడు ప్రపంచంలోనే సంపన్న మహిళ అయిందని... ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందని మేనక నిలదీశారు. యూపీఏ సర్కారు బ్రిటిషర్ల కంటే వంద రెట్లు ఎక్కువగా దోచుకుందని ఆమె మండిపడ్డారు.

  • Loading...

More Telugu News