: రేపు బీజేపీకి జశ్వంత్ సింగ్ రాజీనామా చేసే అవకాశం?
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో టికెట్ల కుమ్ములాటలు మొదలయ్యాయి. సీనియర్ నేతల అలకలు, కలహాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఈ మేరకు సీనియర్ నేత జశ్వంత్ సింగ్ రేపు బీజేపీకి రాజీనామా చేస్తారని విశ్వసనీయ సమాచారం. రాజస్థాన్ లోని బార్మర్ జశ్వంత్ సొంత జిల్లా. దాంతో, ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని కొద్ది రోజుల నుంచి జశ్వంత్ చెబుతున్నారు. అయితే బీజేపీ హైకమాండ్ ఆయనకు ఆ నియోజకవర్గం టికెట్ తిరస్కరించింది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన సోనారాం చౌదరికి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే రికమండేషన్ తో ఆ స్థానాన్ని కేటాయించింది. దాంతో, తీవ్ర అసహనానికి గురయిన జశ్వంత్ పార్టీని వీడాలని, బార్మర్ నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.